FbTelugu

ఆయన ఏమైనా కెసిఆరా? ఎర్రబెల్లా?

తహశీల్దార్ ను చెడామడా తిట్టిన జెడ్పిటిసి
వరంగల్: ఆమె ఒక సాధారణ జెడ్పిటిసి. తన స్థాయిని మరిచి తహశీల్దార్ ను చెడామడా తిట్టింది. పై పెచ్చు సిఎం కెసిఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లను ప్రస్తావించి ఆగ్రహం వ్యక్తం చేసింది.
వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు జెడ్పిటిసి చాడ సరితా రెడ్డి వ్యవహార శైలి జిల్లాలోనే చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సోదరి. మండలంలో ఆమె వాహనాలు అనుమతి లేకుండా మొరం తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. తన వాహనాలను వదిలేయాలని ఆమె తొలుత తహశీల్దార్ కు ఫోన్ చేసింది. వినకపోవడంతో మరోసారి ఫోన్ చేసి తక్కువ జరిమానా వేయాలని హుకుం జారీ చేసింది.

నేను చెప్పినా, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పినా ఒక్కటేనంటూ బెదిరించింది. ఎమ్మెల్సీ మాట వింటారా, స్థానిక ఎంపిపి మాట వింటారో తేల్చుకోవాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించింది. ఈ ఆడియో ఇప్పుడు జిల్లాలో వైరల్ గా మారింది.
నేను చెప్పింది ముందుగా విను. రూ.25వేలు కట్టించుకుని మిషన్ రిలీజ్ చేయి. తహశీల్దార్ కార్యాలయంలో పెట్టుకుంటే తుప్పుపట్టి పోవాల్నా. దీని కోసం తహశీల్దార్ ఆఫీసు ముందు ధర్నా చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. ఈ మాటలకు తహశీల్దార్ స్పందించి, జిల్లా కలెక్టర్ గారు చెప్పినట్లు చేస్తానని చెప్పడంతో ఆమెకు కోపం నషాళానికి ఎక్కింది. మనవాడే కదా అని తీసుకొస్తే రూ.1 లక్ష కట్టమంటే ఎలా, రూ.25వేలు తీసుకుని రిలీజ్ చేయి అంటూ మళ్లీ మండిపడింది. అసలు ఎంపిపి గాడు ఎవడు?. ఆయన ఏమైనా ఎర్రబెల్లి దయాకర్ రావా… లేకుంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావా అని గట్టిగా అరిచింది. ఈ ఆడియో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వైరల్ అయింది. అయితే అధికారులు మాత్రం కఠినంగా వ్యవహరించకుండా నిబంధనల ప్రకారం పనిచేస్తున్న తహశీల్దార్ ను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేశారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.