FbTelugu

మొదలైన పరిషత్ పోలింగ్

అమరావతి: ఏపి లో జడ్పిటిసి..ఎంపిటిసి ఎన్నికలు ప్రారంభమయ్యాయి. టిడిపి ఎన్నికల బహిష్కరణ చేయడంతో అన్ని చోట్లా వైసిపి గెలుపు ఖాయం కానున్నది. కొన్ని చోట్ల నామమాత్రంగా చంద్రబాబు నాయుడు చెప్పినా వినకుండా టిడిపి నేతలు పోటీ చేస్తున్నారు.

ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాంతం మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ పూర్తవుతుంది. రాష్ట్రంలో మొత్తం 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 660 జడ్పీటీసీ స్థానాలకు 126 స్థానాలు ఏకగ్రీవం కాగా వివిధ కారణాలతో 8 జడ్పిటిసి స్థానాలకు నిలిచిపోయాయి. అభ్యర్థుల మృతితో 11 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మిగిలిన 515 జడ్పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా పోటీలో 2,058 మంది అభ్యర్థులు ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం 10,047 ఎంపిటిసి స్థానాలు ఉండగా 2,371 ఎంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాలతో 375 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిలిపివేశారు. అభ్యర్థుల మృతితో 81 చోట్ల ఎన్నికలు వాయిదా పడగా మిగిలిన 7,220 ఎంపిటిసి స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. 7,220 స్థానాలకు పోటీలో 18,782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు .రాష్ట్రంలో మొత్తం ఓటు 2.46 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
జిల్లాల వారీగా పోలింగ్‌ జరిగే స్థానాలు
శ్రీకాకుళం: 37 జెడ్పీటీసీ, 590 ఎంపీటీసీ స్థానాలు.
విజయనగరం: 31 జెడ్పీటీసీ, 487 ఎంపీటీసీ స్థానాలు.
విశాఖపట్నం: 37 జెడ్పీటీసీ, 612 ఎంపీటీసీ స్థానాలు.
తూర్పు గోదావరి: 61 జెడ్పీటీసీ, 1000 ఎంపీటీసీ స్థానాలు.
పశ్చిమగోదావరి: 45 జెడ్పీటీసీ, 781 ఎంపీటీసీ స్థానాలు.
కృష్ణా: 41 జెడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలు.
గుంటూరు: 45 జెడ్పీటీసీ, 571 ఎంపీటీసీ స్థానాలు.
ప్రకాశం: 41 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీ స్థానాలు.
నెల్లూరు: 34 జెడ్పీటీసీ, 362 ఎంపీటీసీ స్థానాలు
చిత్తూరు: 33 జెడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలు
వైఎస్‌ఆర్‌ జిల్లా: 12 జెడ్పీటీసీ, 117 ఎంపీటీసీ స్థానాలు
కర్నూలు: 36 జెడ్పీటీసీ, 484 ఎంపీటీసీ స్థానాలు
అనంతపురం: 62 జెడ్పీటీసీ, 782 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్.

You might also like

Leave A Reply

Your email address will not be published.