FbTelugu

రోడ్డు ప్రమాదంలో జోమోటో బాయ్ మృతి

Zomoto-boy-killed-in-road-accident

ప. గో. జిల్లా: భీమవరంలోని రెస్ట్ హౌస్ రోడ్ లో గురువారం రోడ్డు ప్రమాదం సంభవించింది. జోమోటో లో పని చేస్తున్న యువకుడు అల్లు కరుణ కుమార్ (25) ప్రమాదంలో మృతి చెందాడు. అల్పాహారం కోసం హోటల్ కు వచ్చి పార్సిల్ తీసుకు వెళుతున్న కరుణ కుమార్ రోడ్డు ప్రమాదంలో అక్కడక్కడే మృతి చెందాడు. కే జి ఆర్ కాలేజ్ రోడ్డులోని మోటార్ సైకిల్ పై వెళుతున్న కరుణ కుమార్ ను శంకర మఠం సమీపంలో (రెస్ట్ హౌస్ రోడ్) లో వెనుక నుంచి వస్తున్న ఎస్.వి.ఏం. ఆక్వా కంపెనీ లారీ ఢీకొట్టింది. కుమారుడి మృతి గురించి తెలుసుకున్న తండ్రి నిజామాబాద్ భీమవరానికి హుటాహుటిన బయలుదేరారు. ఒకటో పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like