FbTelugu

అర్చకుల కరోనాపై రాజకీయం సరికాదు: వైవీ

తిరుపతి: అర్చకులకు కరోనా సోకడాన్ని రాజకీయ రంగు పులమడం సరికాదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ తిరుమలలో టీటీడీ చైర్మన్ సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పలు వ్యాఖ్యలు చేశారు.
దర్శనాలు ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు మొత్తం 140 మంది ఉద్యోగులకు కరోనా బారిన పడ్డారని తెలిపారు. ఇందులో సెక్యూరిటీ విభాగంలో సేవలందించే ఏపీఎస్పీ బెటాలియన్ లోని 60 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు.

ప్రసాదాలు తయారు చేసే పోటు కార్మికులకు 16 మందికి, అర్చకులకు 14 మందికి సోకినట్టు తెలిపారు. వీరిలో 70 మంది కరోనానుంచి కోలుకున్నారని తెలిపారు. ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రధాన అర్చకులుగా వివాదాస్పద వ్యాఖ్యలు మీడియా వేదికగా మాట్లాడటం సరికాదన్నారు. రమణ దీక్షితులును పిలిపించి మాట్లాడమని ఈఓ అదనపు ఈఓను కోరుతామని తెలిపారు.

You might also like