FbTelugu

రేపటి నుంచే వైఎస్ఆర్ పెన్షన్ కానుక: మంత్రి పెద్దిరెడ్డి

అమరావతి: రేపటినుంచే (మే 01) వైఎస్ఆర్ పెన్షన్ కానుక ప్రారంభించించనున్నట్టు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి పెన్షన్లు అందించనున్నట్టు తెలిపారు. దీనికోసం ప్రభుత్వం రూ.1,421 కోట్లు విడుదల చేసిందని తెలిపారు.

వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పెన్షన్ అందజేయనున్నట్టు తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రత్యేక మొబైల్ యాప్ ను ఆవిష్కరించినట్టు తెలిపారు. బయోమెట్రిక్ కు బదులు పెన్షనర్ల ఫొటోల జియోట్యాగింగ్ చేయనున్నట్టు తెలిపారు. లాక్ డౌన్ వలన వేరే ప్రాంతాల్లో ఉన్న వారికి పోర్టబిలిటీ సదుపాయం ఉన్నట్టు తెలిపారు.

You might also like