FbTelugu

చిరంజీవి లాగే షర్మిల జెండా కట్టేస్తుంది: గోనే ప్రకాశ్

హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి తనకు లోక సభ సీటు, రాజ్యసభ సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన వైఎస్.షర్మిల తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ అనుచరుడు గోనే ప్రకాశ్ రావు వ్యాఖ్యానించారు.

అన్నా, చెల్లెలి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, షర్మిల వెనకాల వైఎస్.విజయలక్ష్మీ ఉన్నారని ఆయన ఆరోపించారు. గతంలో సినిమా నటుడు చిరంజీవి పార్టీని పెట్టి పలువురు ఆశావహులైన నాయకులను నిండా ముంచాడని, చాలా మంది భూములు, సినిమా హాళ్లు అమ్మి రోడ్ల మీదకు వచ్చారన్నారు. తెలంగాణలో షర్మిల కూడా చిరంజీవి తరహాలో హవా నడుస్తోందన్నారు. పార్టీ నడపలేక చివరకు కాంగ్రెస్ లో చిరంజీవి విలీనం అయ్యారని గుర్తు చేశారు. షర్మిల నమ్మి తమ రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. తెలంగాణలో పార్టీని పెట్టి వైఎస్ఆర్ ప్రతిష్టను దిగజార్చవద్దని ఆయన హితవు పలికారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.