FbTelugu

ఖమ్మం సభకు వైఎస్.విజయలక్ష్మీ

హైదరాబాద్: ఖమ్మంలో వైఎస్.షర్మిల నిర్వహించే ప్రాంతీయ పార్టీ ఆవిష్కరణ బహిరంగ సభకు ఆమె తల్లి వైఎస్.విజయలక్ష్మీ హాజరవుతున్నారు.
సభ నిర్వహణకు అడ్డంకులు తొలగిపోవడంతో షర్మిల ఇతర ఏర్పాట్లు పూర్తి చేయించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

వేయి కార్లతో హైదరాబాద్ నుంచి ఖమ్మం సభా వేదిక వద్దకు ర్యాలీగా బయలుదేరనున్నారు. ఏపీ లో వైఎస్.జగన్మోహన్ రెడ్డికి, తెలంగాణలో వైఎస్.షర్మిలకు అండగా ఉంటానని విజయలక్ష్మీ తాజాగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇద్దరు పిల్లలను సమానంగా చూస్తానని, రాష్ట్రాలు, పార్టీలు వేరైనా వారిద్దరు అన్నా చెల్లెలు అని ఆమె స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.