FbTelugu

గాజులేసుకున్న ప్రతిపక్షాలు: వైఎస్.షర్మిల

కెసిఆర్ మెడలు వంచి ఉద్యోగాలిప్పిస్తా
రాజకీయ స్వలాభం కోసమే జిల్లాల విభజన
హైదరాబాద్: గడీల నుంచి టిఆర్ఎస్ దొరలు పాలిస్తుంటే ప్రతిపక్ష నాయకులు గాజులేసుకుని వత్తాసు పలుకుతున్నారని వైఎస్.షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కెసిఆర్ చిటికేస్తే ఉద్యోగాలు వస్తాయని, నోటిఫికేషన్లు ఇవ్వడం ఆయన చేతిలో పని అని ఆమె అన్నారు.

లోటస్ పాండ్ లో ఇవాళ షర్మిల 72 గంటల దీక్షను విమర్శించారు. ఈ సందర్భంగా నిరుద్యోగ అమరుల కుటుం సభ్యలను ఆమె ఓదార్చారు. ఆత్మహత్య చేసుకున్న రవీంద్రా నాయక్ భార్య, కొప్పు రాజు తల్లి, మురళీ ముదిరాజ్ తల్లికి షర్మిల రూ.50వేల చొప్పు సాయం అందించారు. ప్రైవేటు ఉద్యోగాలు రావడం లేదంటూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయ పరిస్థితుల్లో 40 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. పాలకులకు ఉన్నది గుండెనా… బండరాయా అని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు.
నన్ను చూసి కెసిఆర్ భయపడుతున్నారని, పోలీసులు తనపై దాడి చేసిన తరువాత ఫిర్యాదు చేస్తే తీసుకోవడం లేదని ఆమె ధ్వజమెత్తారు. కెసిఆర్ ఆదేశాలు అమలు చేసేందుకే పోలీసు వ్యవస్థ ఉందా, అందుకే జీతాలు తీసుకుంటున్నారా అని మండిపడింది. ఆడవాళ్ల మీదనా మీ ప్రతాపం, పాలకులకు, పోలీసులకు కనీసం సిగ్గుండాలన్నారు. యూనివర్సిటీలు విసిలు లేకుండా కొనసాగుతున్నాయని, విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లకు బర్రెలు, గొర్రెలు ఇస్తే కాసుకుని బతుకుతారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ స్వలాభం కోసమే కెసిఆర్ జిల్లాలను విభజించారని, జోన్ల సమస్యను పరిష్కరించకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. అదేమంటే కేంద్రం చేయడం లేదంటూ తప్పించుకు తిరుగుతున్నారన్నారు. ఖాళీగా ఉన్న 3.85 లక్షల ఉద్యోగాలను ఎందుకు భర్తీ చేయడం లేదని షర్మిల ప్రశ్నించారు. కెసిఆర్ మెడలు వంచి ఉద్యోగాలు భర్తీ చేయిస్తానని, ఏమైనా చేసి నిరుద్యోగ సమస్యల లేకుండా చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.