FbTelugu

వైఎస్ఆర్ మహానేత… కెసిఆర్ గజదొంగ: షర్మిల

సిరిసిల్ల: రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సిఎం కెసిఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు వచ్చి లేనిపోని విమర్శలు చేసి వెళ్లిపోతారని వైఎస్.షర్మిల మండిపడ్డారు. తెలంగాణను అప్పులపాలు చేసి వేలకోట్లు దోచుకున్న గజదొంగ కెసిఆర్ అని ఆరోపించారు.
హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే మళ్లీ ప్రాంతీయవాదం రెచ్చగొట్టేందుకు టిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారన్నారు.

కెసిఆర్ కు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి వైద్యులపై నమ్మకం లేకనే సోమాజిగూడ యశోదా ఆసుపత్రిలో వైద్యం చేసుకున్నారన్నారు. అలాంటి వ్యక్తి పేదలను సర్కార్ దవాఖానకు వెళ్లాలని ఎలా చెబుతారని ఆమె ప్రశ్నించింది. సర్కార్ వైద్యంపై నమ్మకం లేక పేదలు కార్పొరేట్ హాస్పిటళ్లలో చేరి అప్పులపాలవుతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే బతుకాతానో లేదోనని కెసిఆర్ యశోదకు వెళ్లారని అన్నారు. కరోనాను ఆయుష్మాన్ భారత్ లో చేర్చామని చెబుతున్న కెసిఆర్, గతంలో ఈ పథకాన్ని దిక్కుమాలిన పథకంగా విమర్శించారనే విషయం మర్చిపోయారన్నారు. శుక్రవారం నాడు సిరిసిల్ల జిల్లాలో షర్మిల పర్యటించిన సందర్బంగా ఈ విమర్శలు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.