FbTelugu

ప్రజల ఏజెండానే మా ఏజెండా: షర్మిల

హైదరాబాద్: ప్రజల ఆశయాలకు అద్దం పట్టేలా నూతన రాజకీయ పార్టీ విధానాలు ఉంటాయని వైఎస్.షర్మిల అన్నారు. పార్టీ పెట్టబోయే ఈ నెల రోజులు ప్రజల అభిప్రాయాలు తీసుకుంటామని ఆమె చెప్పారు.

వైఎస్సార్ తెలంగాణ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ లోటస్ పాండ్ లో జరిగింది. ఈ సమావేశానికి షర్మిల అధ్యక్షత వహించగా, ముఖ్య నాయకులు హాజరయ్యారు. పనిచేసే కార్యకర్తలకే పెద్దపీట వేయబోతున్నామని ఆమె ప్రకటించారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారే రేపటి నాయకులుగా ఎదుగుతారన్నారు. కార్యకర్తలు చెప్పిందే తన సిద్ధాంతమని ఆమె వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రజలను భాగస్వామ్యం చేస్తామని షర్మిల తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.