FbTelugu

ప్రగతి భవన్ ప్రజల భవన్ కాదు: వైఎస్.షర్మిల

హైదరాబాద్: ప్రగతి భవన్ కేసీఆర్ తమ కుటుంబ ప్రయోజనాల కోసం కట్టుకుంటే.. క్యాంప్ ఆఫీస్ ను వైఎస్సార్ ప్రజల కోసం కట్టారని వైఎస్.షర్మిల తెలిపారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తప్పక తెస్తామని ఆమె పునరుద్ఘాటించారు.

ఇవాళ లోటస్ పాండ్ లో రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల ఆత్మీయ సమేళనం జరిగింది. ఈ సమావేశంలో షర్మిల మాట్లాడుతూ, తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ డబుల బెడ్ రూమ్ ఇళ్ల హామీతో రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యరు కాని వాటిని ఔటర్ రింగ్ రోడ్ వద్ద, శ్మశానల వద్ద కట్టించారని వైసీపీ నాయకుడు కొండా రాఘవ రెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ ని అనారోగ్యశ్రీ గా మార్చారని, కొత్త అంబులెన్స్ లు కూడా తేలేని పరిస్థితిలో నేటి ప్రభుత్వం ఉందని వైఎస్.షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ ఇవ్వక పోవడం వల్ల కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొందని షర్మిల అన్నారు.
ఇప్పటికి మూడు జిల్లాల వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమేళనం పూర్తి అయిందని. ఇంకా ఏడు జిల్లాల లో నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తామన్నారు.

కొండా రాఘవ రెడ్డి మాట్లాడుతూ, ముస్లిం మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు వైఎస్సార్ కల్పించగా అది కూడా కేసీఆర్ అమలు చేయడంలో అలసత్వం వహిస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల ద్వారా హైదరాబాద్ ఒరిగిందేమి లేదన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ ను విస్మరించారు.. ఇప్పటిదాకా ఎయిమ్స్ లో సౌకర్యాలు మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. లంబాడీలకు 90 వేలు ఎకరాలు పోడు భూములు ఇచ్చిన ఘనత వైఎస్సార్ ది అని, వాటిని ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం లాగేసుకుంటుందని రాఘవ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.