FbTelugu

పాలేరు నా నియోజకవర్గం: వైఎస్.షర్మిల

హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాలేరు ను శాశ్వత నియోజకవర్గంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్.షర్మిల నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి కి కడప జిల్లా పులివెందుల ఎలాగో తనకు కూడా పాలేరు అలాంటిదని ఆమె అంటున్నారు.
షర్మిల పార్టీ ప్రకటన, ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ కు కు ప్రతిబంధకాలు ఎదురయే అవకాశాలు బలంగా ఉన్నారు. కరోనా ఉదృతి నేపథ్యంలో ఏప్రిల్ 9న ఖమ్మం సభ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిర్వహణకు ఇంకో రెండు వారాల సమయం ఉన్నందున ఈలోగా ప్రభుత్వం కొత్తగా ఏదైనా ఆంక్షలు విధించిన పక్షంలో సభ కు అనుమతి ఉంటుందా ? ఉండదా ? అనే సంశయం మొదలైంది. సభ నిర్వహించ తలపెట్టిన మైదానానికి అనుమతి వచ్చినప్పటికీ పోలీస్ శాఖ నుండి మరికొన్ని అనుమతులు రావాల్సి ఉంది. దీనిపై ఏం చేయాలనే దానిపై షర్మిల తర్జనభర్జన పడుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.