FbTelugu

కేసీఆర్, రాములమ్మ ఇక్కడి వారా?: వైఎస్.షర్మిల

హైదరాబాద్: నేను తెలంగాణలో పార్టీ పెట్టడం ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని ఆయన సోదరి వైఎస్.షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇవాళ ఆమె లోటస్ పాండ్ లో మీడియా తో కొద్ది సేపు చిట్ చాట్ చేశారు. నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని షర్మిల అన్నారు.

బీజేపీ నాయకురాలు విజయశాంతి రెడ్డి, సీఎం కేసీఆర్ ఇక్కడివారా అని ఆమె ప్రశ్నించారు. నేను తెలంగాణ కోడలినే అని, నా భర్త ఇక్కడే పుట్టి పెరిగారన్నారు. నాకు అమ్మ విజయలక్ష్మీ మద్దతు ఉందని అన్నారు. మా అనుబంధాల్లోల తేడాలు ఉండవని, రాఖీ కట్టడం, ఇంటికి వెళ్లి రావడం జరుగుతుంటాయని ఆమె స్పష్టం చేశారు. తనకు పదవి ఎందుకు పదవి ఇవ్వలేదో జగన్ నే అడగండని షర్మిల పేర్కొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.