FbTelugu

ఖమ్మం సభ అనుమతిపై మెలికలు

ఖమ్మం: వైఎస్.షర్మిల ఖమ్మం సభకు అనుమతులు ఇచ్చిన పోలీసులు షరతులు విధించడం తలనొప్పిగా మారింది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అట్టహాసంగా అరంగేట్రం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న షర్మిలకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది.

రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులేస్తోన్న వైఎస్ షర్మిలకు తెలంగాణ పోలీసులు ముందరికాళ్లకు బంధం వేశారు. కరోనా నిబంధనల కారణంగా కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఖమ్మంలో వచ్చే నెల 9న సంకల్ప సభ పేరుతో భారీ బహిరంగ సభకు వైఎస్ షర్మిల సన్నద్ధమయ్యారు. దీనికోసం తెలంగాణలోని అన్నిజిల్లాల్లోని వైఎస్ఆర్ అభిమానులు, నేతలతో ఆమె విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మం సభకు పోలీసులు సభకు అనుమతులు ఇచ్చినప్పటికీ.. కరోనా ప్రభావం కారణంగా ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది.

కేవలం 6 వేల మందితో సభ నిర్వహణకు పోలీసులు అనుమతులు ఇచ్చి, అది కూడా కరోనా నిబంధనలు పాటించాలంటూ మెలిక పెట్టారు. కనీసం లక్ష మందితో భారీ బహిరంగ సభ జరపాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకుంటే పోలీసుల నిబంధనలు తలనొప్పిగా మారాయి. ఈ నిబంధనలపై ఏం చేయాలనే దానిపై షర్మిల ముఖ్యనాయకులతో సమావేశమవుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.