FbTelugu

దీక్ష భగ్నం… సొమ్మసిల్లిన షర్మిల

మరోసారి పోలీసులు చేయి వేస్తే ఊరుకోను…

హైదరాబాద్: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలనే డిమాండ్ తో దీక్ష చేస్తున్న వైఎస్.షర్మిల ను పోలీసులు బలవంతంగా శిబిరం నుంచి తరలించారు.

పోలీసులు దీక్షా శిబిరం నుంచి పంపించడంతో ఆమె నడుచుకుంటూ లోటస్ పాండ్ కు బయలు దేరారు. ఇందిరా పార్క్ నుంచి తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్దకు రాగానే సొమ్మసిల్లి పడిపోయింది. ఉదయం నుంచి ఎలాంటి ఆహారం తీసుకోకుండా దీక్షలో కూర్చోవడం మూలంగా అస్వస్థకు గురయ్యారు. పోలీసులు వెంటనే తమ వాహనంలో ఆమెను బేగంపేట పోలీసు స్టేషన్ కు పంపించారు. అక్కడి నుంచి లోటస్ పాండ్ కు పంపించగా, అక్కడే దీక్ష కు కూర్చున్నది. తనపై మరోసారి పోలీసులు చేయి వేస్తే ఊరుకోనని స్పష్టం చేసింది. అంతకు ముందు ఆమె దీక్ష కొనసాగించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

కేవలం 24 గంటలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారని, అంతకు మించి ఇక్కడ కూర్చోవడానికి వీళ్లేదని ఆమెకు పోలీసులు స్పష్టం చేశారు. అయినా విన్పించుకోకపోవడంతో మహిళా పోలీసులు వేదిక మీదకు వెళ్లి ఆమెను కిందకు పంపించారు. మూడు రోజుల పాటు దీక్ష చేస్తానని షర్మిల చెప్పినప్పటికీ పోలీసులు ససేమిరా అనడంతో అక్కడి నుంచి లోటస్ పాండ్ కు పాదయాత్ర గా బయలు దేరింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.