FbTelugu

వైఎస్‌.షర్మిల దీక్ష ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ‌లో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి డిమాండ్ వైఎస్.షర్మిల దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం అనుమతించిన విధంగా ఒక రోజు దీక్షలో కూర్చుంటారా మూడు రోజుల పాటు కొనసాగిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇవాళ ఉదయం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ వద్ద వైఎస్.షర్మీల దీక్ష కు శ్రీకారం చుట్టారు.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన సభలో ఖాళీ ఉద్యోగాల భర్తీ కోసం దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ప్రకారంగానే ఇవాళ దీక్ష కు దిగారు. ఆమె ఈ దీక్షను 72 గంటల పాటు నిర్వహించాలని భావించ‌డగా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఆమె ఎప్ప‌టివ‌ర‌కు దీక్ష చేస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకుంటున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.