FbTelugu

రంగులు మార్చి… నా బొమ్మ వేయాలి: జగన్ ఆదేశం

తాడేపల్లి: గ్రామ పంచాయతీ కార్యాలయాలకు రంగుల మార్పుపై సీఎం వైఎస్. జగన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

అన్ని పంచాయతీ భవనాలకు వెంటనే రంగులు మార్చాలని పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అన్ని కార్యాలయాలకు తెలుపు రంగు మాత్రమే వేయాలని స్పష్టం చేసింది. అయితే సీఎం జగన్ రెడ్డి బొమ్మ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. భవనాలపై ఉన్న నీలం, ఆకుపచ్చ రంగుల్ని వెంటనే తొలగించాలని కోరింది. 14వ ఆర్థిక సంఘం నుంచి నిధులు ఖర్చు చేయాలని ఆదేశాలు వెళ్లాయి.

పంచాయతీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తున్నారని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే వైసీపీ రంగులు తీసివేయాలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. అయితే అమలు చేయకుండా వైసీపీ రంగులనే వేయడంతో మళ్లీ హైకోర్టులో కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. పార్టీ రంగులను తొలగించాలని హైకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. అమలు చేయకుండా ఏపీ పంచాయతీరాజ్ శాఖ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సుప్రీంకోర్టులో స్టే మంజూరు కాలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.