FbTelugu

కర్ఫ్యూ కొనసాగింపు తప్పదు: జగన్

అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 20 తర్వాత కర్ఫ్యూ లో కొన్ని సడలింపులు ఇవ్వాల్సి ఉంటుందని, అదే సమయంలో కర్ఫ్యూ కొనసాగుతుందని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వారానికి ఒకసారి ఫీవర్‌ క్లినిక్స్‌ కూడా కచ్చితంగా నిర్వహించాలి. థర్డ్‌వేవ్‌ వస్తుందో, లేదో మనకు తెలియదు కాని సిద్ధంగా ఉండడం అనేది మన చేతుల్లోని అంశమన్నారు. అది వచ్చినప్పుడు ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలిన్నారు. థర్డ్‌వేవ్‌లో పిల్లలు ప్రభావితం అవుతారని చెప్తున్నందున ఈ అంశాలను జిల్లా కలెక్టర్లు దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లాస్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధంచేసి అమలు చేయాలని సూచించారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను తీసుకొస్తున్నామన్నారు.

వైజాగ్‌లో ఒకటి, కృష్ణా–గుంటూరు ప్రాంతంలో ఒకటి తిరుపతిలో మరొకటి అని సిఎం అన్నారు.
దీనికి సంబంధించి అవసరమైన భూములను జిల్లా కలెక్టర్లు గుర్తించాలని సూచించారు. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి ఉంటే… ఇందులో 26,33,351 మందికి మాత్రమే రెండు డోసులు ఇవ్వగలిగామన్నారు. మరో 69,0,710 మందికి మాత్రమే ఒకడోసు ఇవ్వగలిగామని వివరించారు. వ్యాక్సినేషన్‌ విషయంలో మనం చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో ఈ– క్రాపింగ్‌ బుకింగ్‌అనేది చాలా ముఖ్యమని, అది చేయకపోతే జిల్లా కలెక్టర్‌ విఫలం అయ్యారని భావించవచ్చని అన్నారు. జూన్‌ 22న చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని, జులైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేస్తున్నందున దీనికి కలెక్టర్లు అంతా సిద్ధంకావాలని జగన్ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.