FbTelugu

ఒలింపిక్స్ కు వెళ్లేవారికి జగన్ అభినందనలు

తాడేపల్లి: టోక్యో సమ్మర్‌ ఒలింపిక్స్‌ 2020 కు ఆంధ్రప్రదేశ్‌ నుంచి భారతదేశం తరపున పాల్గొంటున్న ఒలింపియన్స్‌ పి.వి సింధు, ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రజనీలకు సిఎం వైఎస్‌.జగన్‌ అభినందనలు తెలిపారు.

పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఒక్కొక్కరికీ రూ.5లక్షల చెక్‌ అందజేశారు. విశాఖలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం కేటాయించిన రెండు ఎకరాల భూమికి సంబంధించిన జిఒ ప్రతిని పి.వి. సింధుకి అందించారు. రజనీ (ఉమెన్స్‌ హకీ), చిత్తూరు జిల్లా, ఆమె బెంగళూరులో శిక్షణలో ఉన్న కారణంగా ఆమె కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జపాన్‌ దేశం టోక్యో నగరంలో జులై 23, 2021 నుంచి ఆగష్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌ జరగనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.