FbTelugu

ఇవాళ తీరం దాటనున్న యాస్ తుఫాన్

భువనేశ్వర్: యాస్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండ్ లోని పలు ప్రాంతాలలో ఇవాళ ఉదయం నుంచి వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రభుత్వలు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

యాస్ తుఫాన్ ఇవాళ మధ్యాహ్నం బాలాసోర్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. తీరం దాటుతున్న సంయంలో గంటకు 130 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని భువనేశ్వర్ వాతావరణ విభాగం హెచ్చరించడంతో ప్రభుత్వం ప్రజలను జాగ్రత్తగా ఉండాలని కోరింది. తీరప్రాంత ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలని సిఎం నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. పశ్చమ బెంగాల సిఎం మమతా బెనర్జీ ప్రభావిత జిల్లాల్లో ఉన్న 11.5 లక్షల మందిని ఇతర ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు ఆమె ప్రకటించింది. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ 38 రైళ్లను రద్దు చేసింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాలలో పడవలు, వరద సహాయ బృందాలు, ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బందిని సిద్దం చేసి పెట్టారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.