FbTelugu

యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్ అరెస్టు

హైదరాబాద్: రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి అమలవుతున్న నైట్ కర్ఫ్యూ పై ఇష్టానుసారంగా విమర్శలు చేసిన యూ ట్యూబ్ ఛానల్ రిపోర్టర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

నైట్ కర్ఫ్యూలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారంటూ నకిలీ వీడియోలు పెట్టిన యూ ట్యూబర్ పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. మున్ముందు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లాఠీ ఛార్జ్ జరక్కుండానే జరిగినట్లు ఎలా వీడియోలు పెడతారని అంజనీ కుమార్ మండిపడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.