FbTelugu

కత్తులతో దాడి చేయడంతో యువకుడు మృతి

జనగామ: కొందరు గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేయడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని బచ్చన్నపేట మండలం కొడవటూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

కొన్నేరు గ్రామానికి చెందిన శ్రీధర్ అనే యువకుడు బైకుపై వెళుతుండగా.. కొడవటూరులో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో ఒక్కసారిగా దాడి చేశారు. దీంతో ఆ యువకుడు అక్కడి కక్కడే మృతి చెందాడు. ప్రేమ వ్యవహారంతోనే దుండగులు ఈ హత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like