FbTelugu

మీ వ్యాక్సిన్ మీ ఇష్టం!: కేంద్రం

ఉచితం కాదంటూ సంకేతాలు

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ ను బహిరంగ మార్కెట్ లో అధిక ధరకు విక్రయించుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం గేట్లు బార్లా తెరిచింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మూలంగా తయారు చేస్తున్న కంపెనీలు బహిరంగ మార్కెట్ కు ఎక్కువగా మళ్లించే ప్రమాదముంది.

కేంద్ర ప్రభుత్వం ఇవాళ మూడో విడత కరోనా వ్యాక్సిన్‌ మార్గదర్శకాలు జారి చేసింది. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న కంపెనీలు ఇక నుంచి ఉత్పత్తి చేసిన దానిలో 50శాతం వ్యాక్సిన్ డోసులు అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. 50 శాతం వ్యాక్సిన్ లు రాష్ట్రాలకు, విపణిలో అమ్ముకునేందుకు వీలు కల్పించడంతో రాష్ట్రాల మధ్య పోటీ ఏర్పడే ప్రమాదముంది. ఉత్పత్తి సంస్థలు మార్కెట్‌లో నిర్దేశిత ధరకు అమ్ముకోవచ్చు. గతంలో ప్రకటించిన విధంగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 45ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ యథావిధిగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఐదు రాష్ట్రాలలో ఎన్నికలు దాదాపు పూర్తి కావడంతో కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడించింది. ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని పరోక్షంగా ప్రకటించింది. బెంగాల్ లో మరో మూడు దశలు జరగాల్సి ఉంది. అమెరికా లాంటి దేశాల్లో ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుండగా ఇండియాలో మాత్రం డబ్బులు తీసుకుని వ్యాక్సిన్ ఇస్తుండడం శోచనీయం.

You might also like

Leave A Reply

Your email address will not be published.