FbTelugu

మోహన్ బాబు ఫాంహౌస్ లో యువకులు హల్ చల్

హైదరాబాద్: సినీ నటుడు మోహన్ బాబు ఫాంహౌస్ దగ్గర కొందరు యువకులు హల్ చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు యువకులు మోహన్ బాబు ఫాంహౌస్ వద్దకు వచ్చి మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.

దీంతో మోహన్ బాబు, మంచు విష్ణు పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.

You might also like