FbTelugu

అన్న, అక్కను చంపిన తమ్ముడు

శ్రీకాకుళం: రణస్థలం మండలం కొవ్వాడ పంచాయతీ రామచంద్రాపురం లో దారుణం చోటు చేసుకున్నది. సొంత అన్న, అక్కను తమ్ముడే కత్తితో నరికి చంపాడు.
కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పరిహారం డబ్బు, ఆస్తి విషయంలో గత కొన్ని రోజులుగా వీరి మధ్య పెద్ద గొడవలు జరుగుతున్నాయి.

బంధువులు కూడా జోక్యం చేసుకుని పంచాయతీ చేశారు. అయినా తమ్ముడు విన్పించుకోలేదు. గ్రామ పెద్దలకు చెప్పిన వినకపోవడంతో అన్నను, అక్క ను హత్య చేశాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియచేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించి, నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.