FbTelugu

ఉరేసుకున్న యువతికి 123 మిస్డ్ కాల్స్!

రంగారెడ్డి: బడా నాయకుల అండదండలతో అష్రాప్ అనే యువకుడు నిత్యం వేధింపులకు పాల్పడడంతో ఒక యువతి బలవన్మరణం చెందింది. మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడలో చోటు చేసుకున్నది.

పోలీసుల కథనం ప్రకారం అష్రాఫ్ అనే వ్యక్తి కొద్ది నెలలుగా వేధిస్తున్నాడని యువతి లిజ తన కుటుంబ సభ్యులకు తెలియచేసింది. అమ్మాయి వెంటపడొద్దని, పడితే బాగుండదని కుటుంబ సభ్యులు అతన్ని పలుమార్లు మందలించినా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. వెంటపడడమే కాకుండా నిత్యం ఫోన్ లో వేధింపులకు గురి చేస్తున్నాడు. ఎంతకూ వేధింపులు తగ్గకపోవేడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో లిజ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న తరువాత కూడా 123 మిస్స్ డు కాల్స్ ఉన్నాయని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలిన డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.