FbTelugu

వంట చేసే మొగుడే కావాలి: యువతి యాడ్

మూడు పదులు నిండిన ఒక యువతి నచ్చిన వరుడి కోసం గుణగణాలు తెలుపుతూ ఇచ్చిన పెళ్లి ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా మగవాళ్లు వంటలు బాగా చేసే అమ్మాయిని కోరుకుంటారు. కాని ఇక్కడ విచిత్రంగా యువతి వంటలు వచ్చిన మొగుడిని కోరుకోవడం విశేషం.
ఒక యువతి తన జోడు కోసం పెళ్లి ప్రకటనలో కోరిన కోర్కెలు ఇలా ఉన్నాయి. తన వయస్సు 30 సంవత్సరాలు, తనకు అందమై, మంచి రంగుతో శరీర సౌష్టవం కలిగిన పాతికేళ్ల వరుడు కావాలి. డబ్బులు కూడా దండిగా ఉండాలి. తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడై ఉండాలి. పెద్ద బంగళా, ఇరవై ఎకరాల ఫామ్ హౌస్ ఉండాలి. ఇక్కడి వరకు బాగానే ఉంది.

స్త్రీ వాది అయి ఉండడంతో పాటు, వంటలు చేసి పెట్టాలని డిమాండ్ పెట్టింది. అతనికి గ్యాస్ట్రిక్ సంబంధ రోగం ఉండకూడదు. ఈ షరతులు ఒప్పుకున్నవారు, అర్హతలు ఉన్నవారు తమ బయోడేటాను ఈ మెయిల్ చేయాలని సూచించింది. ఈ ప్రకటన చూసిన పలువురు నిజమేనని అనుకుని పిచ్చోళ్లు అయిపోయారు.
ఈ ప్రకటనను కామెడియన్ అదితి మిట్టల్ ట్విటర్ లో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది. అయితే ఇది నిజం కాదని, తన సోదరికి 30 ఏళ్లు నిండడంతో ఏడ్పించేందుకు సోదరుడే ఇలాంటి ప్రకటన ఇచ్చినట్లు వెల్లడైంది. ఈ ప్రకటన కింద ఆమె మెయిల్ అడ్రస్ ఇవ్వడంతో బూతులు తిడుతూ మెయిళ్లు పెట్టారంట. గోల్డ్ డిగ్గర్, కౌగర్ అంటూ బూతు పదాలు వాడారంట మరి. జనంతో ఆటలాడుకుంటే ఇలాగే ఉంటుంది మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.