ముంబయి: మహిళలు హద్దులు దాటుతున్నారు. వారు కూడా సుఫారీ ఇచ్చి నచ్చనివారిని మట్టుపెడుతున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి నాగపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది.
ఇదివరకే పెళ్లైన వ్యక్తి చందూ తో 20 సంవత్సరాలు నిండిన ఒక యువతి అక్రమ సంబంధం పెట్టుకున్నది. పరస్పర అంగీకారంతో రెండేళ్లుగా పని కానిచ్చేస్తున్నారు. ఈ మధ్య ఆ యువతికి సంబంధం రావడంతో అంగీకారం తెలపడం ప్రియుడికి ఏమాత్రం నచ్చలేదు. పెళ్లి చేసుకోవద్దని, తనతోనే ఉండాలని ఒత్తిడి పెంచడంతో ఆ యువతి తట్టుకోలేకపోయింది. అతన్ని శాశ్వతంగా అడ్డుతొలగించుకునేందుకు పన్నాగం పన్నింది. ఇందుకోసం ఆమె ఒక వ్యక్తికి సుఫారీ ఇచ్చింది. ప్రియుడిని చంపేస్తే రూ.1.5 లక్షల నగదుతో పాటు ఒక పూట పడకసుఖం ఇస్తానని హామీ ఇచ్చింది. ఇతను కూడా ప్రియుడికి దూరం బంధువు భరత్ గుర్జర్ కావడం విశేషం.
యువతి ఇచ్చిన రెండు ఆఫర్లు నచ్చడంతో భరత్ ఆమె ప్రియుడు చందూను మద్యం సేవిద్దాం రమ్మంటూ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లు. అతని తలపై గట్టిగా బాది చంపేశాడు. ఆ తరువాత మృతదేహాన్ని స్టోన్ క్రషింగ్ యూనిట్ లో పడేసి వెళ్లిపోయాడు. స్టోన్ క్రషింగ్ యూనిట్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి హంతకుడు భరత్ ను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా అతన్ని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే హంతకుడికి యువతి ఇచ్చే డబ్బులు, ఒక పూట పడక సుఖం అందకముందే జైలుకు వెళ్లాడు.