FbTelugu

టీఆర్ఎస్ నేత పై పోలీసులకు యువతి ఫిర్యాదు

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా ప్రచారకర్తగా, ఆ పార్టీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేసే నాయకుడు కరణ్ రెడ్డిపై ఒక యువతి జూబ్లిహిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తనకు వల వేసి వాడుకున్నాడని, పెళ్లి చేసుకోమని అడిగితే నిరాకరిస్తున్నాడని ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోలీసులను కోరింది. టీఆర్ఎస్ పార్టీకి చెందిన హోర్డింగులు, పోస్టర్లు, బ్యానర్లు, కటౌట్లు ఇతర ప్రచార సామాగ్రి ఏర్పాట్లు చేసే వ్యక్తిగా కరణ్ రెడ్డి పేరు పొందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.