FbTelugu

ఇసుక లారి ప్రమాదంలో యువతి మృతి

హైదరాబాద్: ఇసుక లారీల కారణంగా గ్రామాలతో పాటు పట్టణాల్లో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. రాత్రి వేళల్లో తిరిగేందుకు అనుమతించడంతో మితిమీరిన వేగంతో నడుపుతూ ప్రాణాలను బలిగొంటున్నారు.

నగరంలోని కేపీహెచ్‌బీ పీఎస్‌ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదర్‌నగర్‌ పిల్లర్‌ నెంబర్‌ 660 దగ్గర ప్రమాదం సంభవించింది. మియాపూర్ నుంచి జేఎన్టీయూ వైపు బైకుపై వెళ్తున్న ఆదిరేష్మి (22)ని ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.