FbTelugu

తప్పుడు నెంబర్, అడ్రస్ కూడా…

 

విశాఖ: విశాఖపట్నంలో ఒక యువతి కోసం పోలీసులు, రెవెన్యూ అధికారులు నానా హైరానా పడుతున్నారు.

ఢిల్లీ నుంచి విమానాంలో విశాఖకు వచ్చిన ఒక యువతి అందరి కళ్లు కప్పి పరార్ అయ్యింది. క్వారంటైన్ సెంటర్ కు తరలించేముందు యువతి అదృశ్యమైంది. ఫోన్ నెంబర్ మార్చి అధికారులకు మస్కా కొట్టింది. విమానం టికెట్ లోనూ తప్పుడు అడ్రస్ ఇవ్వడంతో ఎలా పట్టుకోవాలో తెలియక అధికారులు గాబరా పడుతున్నారు. ఇక చేసేది లేక సదరు యువతిపై టౌన్ పీఎస్ లో తహశీల్దార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమెపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

You might also like