FbTelugu

బోర్ కొడుతుందని యువతి ఆత్మహత్య !

చిత్తూరు: లాక్ డౌన్ లో ఇంట్లో బోర్ కొడుతోందని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలోని కలకడ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. యువతి విజయవాడలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది. కాగా కరోనా నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించగా ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది.

అయితే లాక్ ఎత్తివేస్తే తొందరగా కాలేజీకి వెళ్తానని ఇంట్లో బోర్ కొడుతోందని పలు మార్లు చెప్పినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.