FbTelugu

యువతి నచ్చినవాడిని పెళ్లి చేసుకోవచ్చు: హైకోర్టు

ఢిల్లీ: లవ్ జీహాద్ పై రచ్చ జరుగుతుండగానే ఢిల్లీ హైకోర్టు ప్రేమ వివాహాలపై సంచలన తీర్పు ఇచ్చింది. ఈడొచ్చిన ఆడపిల్ల నచ్చినవాడిని పెళ్లి చేసుకుని ఎక్కడైనా ఉండొచ్చని స్పష్టం చేసింది.

ఢిల్లీకి చెందిన ఇరవై సంవత్సరాల యువతి తన ప్రియుడు ను పెళ్లి చేసుకుని ఇంటి నుంచి వెళ్లింది. దీనిపై ఆమె సోదరుడు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశాడు. ఈ కేసును జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రజనీశ్ భట్నాగర్ విచారించారు. సులేఖ తన ప్రియుడు బబ్లూతో కలిసి వెళ్లిపోగా, కిడ్నాప్ అయిందంటూ సోదరుడు పిటీషన్ వేశారు. బబ్లూ అనే వ్యక్తిపై అనుమానం ఉందంటూ తెలిపాడు.
ఢిల్లీ పోలీసుల ద్వారా సులేఖ జాడను కనిపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సులేఖను హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారించింది. ఇష్టప్రకారమే బబ్లూను వివాహం చేసుకున్నానని చెప్పింది. దీంతో ఆమె ఇష్టప్రకారం కోరుకున్నవాడితో ఉండవచ్చని జడ్జీలు స్పష్టం చేస్తూ, సోదరుడికి కౌన్సలింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రేమజంటకు రక్షణ కల్పించాలని, సంబంధిత ప్రాంతానికి చెందిన పోలీసు స్టేషన్ నెంబర్ కు వారికి ఇవ్వాలని హైకోర్టు అధికారులను సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.