FbTelugu

ఫేస్ బుక్ లో యువతులే అతని టార్గెట్

కడప: ఫేస్ బుక్ లో యువతులకు గాలం వేసి వారినుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతున్న ఓ కేటుగాన్ని పోలీసులు జిల్లాలోని ప్రొద్దుటూరులో అరెస్టు చేశారు. వివరాల్లోకెళితే.. రాజ్ కుమార్ అనే యువకుడు ఫేస్ బుక్ లో యువతులకు గాలం వేసి పరిచయం పెంచుకుని, వారితో సన్నిహితంగా

మెలిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నాడు. అనంతరం వారిని లొంగదీసుకుని వారి నుంచి బంగారం, డబ్బూ వసూలు చేస్తున్నాడు. దీంతో ఓ యువతి ఫిర్యాదు మేరకు నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిందితునిపై ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్టు తెలిపారు.

You might also like