FbTelugu

ఔరా… కుక్క మాదిరే చిరుతను నడిపించారు!

అందరూ చిరుతను చూడగానే వణికిపోతారు. అలాంటిది ఏకంగా కుక్క మాదిరే దాని మెడకు తాడేసి నడిపించుకుంటూ తీసుకువెళ్లారు.

ఆపైన వీడియో తీసి టిక్ టాక్ లో ఎక్కించారా యువతీ, యువతులు. పొరుగున ఉన్న నేపాల్ దేశంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. పర్భత్ జిల్లా జల్జాల గ్రామంలో చిరుత పులి సంచరిస్తున్నదని గ్రామస్థులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపే కొందరు యువకులు చిరుతను పట్టుకున్నారు. దాన్ని బంధించి క్షేమంగా పెట్టే బదులు మెడకు తాడు కట్టారు. కుక్కను ఊరేగించిన విధంగా ఊరేగించి వీడియోలు తీసుకున్నారు. ఇది చూసిన స్థానికులు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు.

You might also like