FbTelugu

టవరెక్కి హల్చల్ చేసిన వ్యక్తి

తూ.గో జిల్లా: రాజోలు లో సుధాకర్ అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసుకుంటానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడు.

మామిడికుదురు మండలం నగరం పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కుటుంబ కలహాల కారణం అని స్థానికులు అంటున్నారు. నగరం ఎస్సై సతీష్ బాబు ఫైర్ సిబ్బంది తీసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ఎస్సై సతీష్ బాబు సుధాకర్ తో చర్చలు జరిపి, డిమాండ్ నెరవేరుస్తానని హామీ ఇవ్వడంతో దిగిరావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుధాకర్ అదుపులోకి తీసుకుని నగరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.