కృష్ణా: మైనర్ బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన బాపులపాడు మండలం, ఆరుగొలనులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
స్థానిక ఆరుగొలనులో రాంబాబు (నిందితుడు) అనే యువకుడు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకునిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.