ఇస్లామాబాద్ : టిక్ టిక్ పిచ్చితో ఓ యువకుడు రైలు పట్టాల వెంట చేసిన స్టంట్ బెడిసికొట్టి ఏకంగా ప్రాణాలే కోల్పోయిన ఘటన పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్ సమీపంలోని రావల్పిండిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..
హంజా నవీద్(18) అనే యువకుడు స్థానిక రావల్పిండిలో షా ఖలీద్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వద్ద స్టంట్ వీడియోకు యత్నించాడు. టిక్ టాక్ వీడియో తీసుకునేందుకు రైలుపట్టాల వెంటనిలబడి వస్తుండగా.. అప్పుడే వచ్చిన ఓ రైలు ఆ యువకున్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో సదరు యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.