FbTelugu

యువకుడు కిడ్నాప్.. రూ.5 లక్షలు డిమాండ్

అనంతపురం: ఓ యువకున్ని కిడ్నాప్ చేసి తల్లిదండ్రులను రూ.5 లక్షలు డిమాండ్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జిల్లాలోని ధర్మవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకెళితే.. కార్తిక్ అనే యువకున్ని కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు.

అనంతరం కిడ్నాపర్లు కార్తిక్ కుటుంబీకులకు ఫోన్ చేసి రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బులు తీసుకొని కర్ణాటక బార్డర్ చెక్ పోస్ట్ దగ్గరకు తీసుకురావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు సమాచారం దించగా రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల వేటలో పడ్డట్టు సమాచారం.

You might also like