FbTelugu

పెళ్లి వద్దని అది కోసేసుకున్నాడు!

చెన్నై: పెళ్లి వద్దని ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు పట్టించుకోకుండా అమ్మాయిని చూడడంతో విసుగుచెందిన ఒక యువకుడు ఏకంగా తన పురుషాంగాన్నే కోసేసుకున్నాడు.
ఊహించని ఘటనతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. వెంటనే అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

సేలం జిల్లా గాంధీ నగర్ లో ఈ ఘటన జరిగింది. మురుగన్ కు పెళ్లీడు వచ్చిన కుమారుడు విజయ రాఘవన్ (23) ఉన్నాడు. పెళ్లి చేయాలని ఏడాదిగా ఒత్తిడి తెస్తున్నారు. విన్పించుకోకపోవడంతో సంబంధం చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండేళ్ల వరకు తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పినా వినకుండా ఒక యువతితో నిశ్చితార్థం ఖరారు చేశారు. ఈ విషయం తెలిసిన రాఘవన్ తన పురుషాంగాన్ని కోసేసుకుని, ఇక తను పెళ్లికి పనికి రానంటూ గట్టిగా కేకలు వేశాడు. అతన్ని వెంటనే అత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. రెండు మూడు రోజులు గడిస్తే కాని ఏమి చెప్పలేమని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు తలలు పట్టుకుని రోదిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.