FbTelugu

కులం తెలుసుకుని ప్రేమించాలి…

అనంతపురం: కులం చూడకుండా ఎవరిని ప్రేమించవద్దని, పెళ్లికి ఒప్పుకోరని చెబుతూ ఒక యువకుడు పురుగుల మందు తాగిన వీడియోను వాట్సప్ స్టేటస్ లో పోస్ట్ చేశాడు. వాట్సప్ స్టేటస్ చూసిన అతని మిత్రులు ఉరవకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉరవకొండ మండలం బూదగవి కొండపై ప్రేమ విఫలం కావడంతో బెస్త సుధాకర్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉరవకొండ ఎస్సై ధరణిబాబు సిబ్బందితో కలసి సంఘటన స్థలానికి చేరుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్న యువకుడిని ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు అనంతపురం తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.