FbTelugu

ప్రియురాలు మోసం చేసిందని ఆత్మహత్య

పశ్చిమ గోదావరి: తన ప్రియురాలు మొసం చేసిందంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలోని భీమవరం, ఉండీ రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకెళితే.. ఓ యువకుడు తన ప్రియురాలు తనని మోసం చేసి తన స్నేహితునికే దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాని, వాళ్లని కఠినంగా శిక్షించాలంటూ.. సెల్ఫీ వీడియో తీసీ ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

You might also like