FbTelugu

కుప్పకూలి చనిపోయాడు…

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కు చెందిన ఒక యువకుడు ప్రైవేటు హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కోసం వచ్చి ఈసీఐఎస్ చౌరస్తాలో కుప్పకూలిపోయాడు.

రెండు మూడు నిమిషాల వ్యవధిలో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమీపంలోని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేసుకునేందుకు వచ్చాడు. కుప్పకూలిన వ్యక్తిని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొద్ది సేపటికే అంబూలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని అతడిని పరిశీలించారు. నాడి కొట్టుకోవడం ఆగిపోవడంతో చనిపోయినట్లు నిర్థారణకు వచ్చారు.

చనిపోయిన వ్యక్తి జవహర్ నగర్ బీజేఆర్ నగర్ కు చెందిన పృథ్వీరాజ్ గా గుర్తించారు మూడు రోజులుగా జలుబు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితమే వివాహం అయిన పృథ్వీకి తొమ్మిది నెలల కుమారుడు ఉన్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.