FbTelugu

బాలికపై యువకుడు దారుణం

శ్రీకాకులం : ఓ యువకుడు బాలికపై గత కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతూ.. గర్భవతిని చేసిన ఘటన జిల్లాలోని మెళియాపుట్టి మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువకుడు తొమ్మిదవ తరగతి విద్యార్ధినిపై గత కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నారు.

ఈ తరుణంలో బాలిక గర్భం దాల్చింది. అబార్షన్ కోసం ఆయువకుడు కొన్ని మందులను ఆ బాలికకు వేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితునిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like