FbTelugu

యూ ట్యూబ్ ఫ్లాట్ ఫాం లుక్ మారింది…

You-Tube-flat-form-look-Changed

వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా యూ ట్యూబ్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ వస్తున్నాయి. తాజాగా యూ ట్యూబ్ ఫ్లాట్ ఫాం లుక్ ను మార్చేసింది. గూగుల్ రూపొందించిన కొత్త వెర్షన్ లో పలు నూతన ఫీచర్లు ఉన్నాయి. ఇకనుంచి యూట్యూబ్ లో వీడియోల థంబ్ నెయిల్స్ కాస్త పెద్దవిగా కన్పిస్తాయి. ఇంతవరకు పొడవైన టైటిల్స్ పెట్టుకునే అవకాశం లేకపోగా, ఇకనుంచి పొడుగ్గా టైటిల్స్ పెట్టుకునే వెసులుబాటు ఇచ్చారు. హై రిజల్యూషన్ లో ప్రీవ్యూ వీడియోస్ ను చూడడంతో పాటు హోం పేజీలో ఉండే వీడియోలను ప్లే లిస్టు రూపంలో సేవ్ చేసుకుని తరువాత చూడవచ్చు. వీడియోలో కింది భాగంలో వీడియోలను క్రియెట్ చేసిన వారి ఛానల్ ఐకాన్లు కన్పించనున్నాయి. ఐకాన్లు పెట్టడం వల్ల ఎవరు క్రియెట్ చేశారనే సుస్పష్టమవుతుంది. మొబైల్ ఫ్లాట్ ఫాం పై ఇకనించి సజెస్టెడ్ వీడియోలు కన్పించవు. అయితే ఈ ఫీచర్ ను మాత్రం డెస్క్ టాప్ లో కొనసాగిస్తారు. తాము వీక్షించిన వీడియోలకు సంబంధించిన వీడియోలను హోం పేజీలో కన్పించేలా పెట్టుకోవచ్చు.

You might also like