FbTelugu

మీకు అధికారంలో ఉండే హక్కులేదు: సుప్రీంకోర్టు

You-have-no-right-to-power-says-Supreme-Court

హైదరాబాద్: పశువుల ప్రాణాలు పోతుంటే పట్టించుకునే ప్రభుత్వాలు, మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా అని సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలను ప్రశ్నించింది. ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేని ప్రభుత్వాలకు ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండే హక్కులేదని మండిపడింది. ఢిల్లో పొగ కాలుష్యంపై విచారణ జరుగుతున్న సందర్భంగా సుప్రీంకోర్టు పంజాబ్, హర్యానా ప్రభుత్వాలపై ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. పంట వ్యర్థాల దహనం ద్వారాల వెలువడే పొగ, కాలుష్యం కారణంగా ఢిల్లీలో విమానాలను దారి మళ్లిస్తున్నారు. ఇళ్లల్లో ఉన్నవారు బయటకు రాలేని పరిస్థితి ఉంది, మీకు ఏమాత్రం సిగ్గుగా లేదా అని సుప్రీంకోర్టు ఎడాపెడా వాయించింది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా పంట వ్యర్థాలు దహనం చేస్తారని తెలిసి కూడా రెండు రాష్ట్రాలు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. పంట వ్యర్థాల దహనాన్ని నిలువరించడంలో విఫలమైందని నిందించింది. ఈ నిర్లక్ష్యానికి పాలకులతో పాటు ఉన్నతాధికారలను శిక్షించే సమయం ఆసన్నమైందన్నారు.

You might also like