FbTelugu

ఐఏఎస్ లపై నీకు అధికారం లేదు: ఏపీ సీఎస్

అమరావతి: సీనియర్ ఐఎఎస్ అధికారులు గోపాల కృష్ణ ద్వివేది, గిరిజా శంకర్ ల పై జారీ చేసిన సెన్సుర్ ప్రొసీడింగ్స్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు (ఎస్ఈసీ) తిప్పి పంపారు.

ఐఎఎస్ లపై ప్రొసీడింగ్స్ ను జారీ చేసే అధికారం ఎస్ఈసీకి లేదని సీఎస్ ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. అధికారుల నుంచి వివరణ కోరేలా నోటీసు కూడా జారీ చేయకుండా సెన్సూర్ ప్రొసీడింగ్స్ ను ఎవరూ జారీ చేయలేరని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించారంటూ ఎస్ఈసీ ప్రొసీడింగ్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. వారి నిర్లక్ష్యాన్ని సర్వీసు రికార్డుల్లో (ఎస్ఆర్) రిమార్కు గా నమోదు చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖకు (డీఓపీటీ) సెన్సూర్ ప్రొసీడింగ్స్ పంపించింది కూడా.

You might also like

Leave A Reply

Your email address will not be published.