FbTelugu

‘అయోధ్య’పై మంత్రులకు యోగి వార్నింగ్

Yogi-warns-Ministers-about-Ayodhya

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ అయోధ్య కేసు విషయంలో తన మంత్రి వర్గానికి గట్టి వార్నింగే ఇచ్చాడు. సుప్రీంకోర్టులో అయోధ్య కేసు తుది తీర్పువెలువడనున్న నేపథ్యంలో మంత్రులు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర మంత్రి ఒకరు ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. తీర్పు తమకు అనుకూలంగా వచ్చినా.. వ్యతిరేకంగా వచ్చినా.. సంయమనం పాటించాలని సూచించినట్టు తెలిపాడు. ఇది సున్నితమైన అంశమని కేసు అనంతరం వేడుకలు చేసుకోరాదని పేర్కొన్నాడు.

You might also like