FbTelugu

యోగా, ప్రాణాయామం చేస్తే చాలు: ప్రధాని మోదీ

హైదరాబాద్: పని ఒత్తిడితో ఉన్నవారికి యోగా, ప్రాణాయామం బాగా ఉపయోగపడుతుందని, మంచి ఉపశమనం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీసు అకాడెమీలో యువ ఐపీఎస్ అధికారులను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. మీరు గుండె నిండుగా మనసు పెట్టుకుని ఏ పని చేసినా లబ్ధి జరుగుతుందని ప్రధాని అన్నారు. ఎంత పని ఉన్నా ఒత్తిడికి గురికారనే నమ్మకం తనకు ఉందన్నారు.

ఐపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ల శిక్షణాకాలం ముగియడంతో ఇవాళ పోలీసు అకాడేమీలో దీక్షాంత్ పరేడ్ నిర్వహించారు.

You might also like