FbTelugu

మొన్న రాముని విగ్రహం.. నేడు సీత విగ్రహం ధ్వసం

అమరావతి : ఏపీలో విగ్రహాల ధ్వసం పర్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో ఓ పక్క రామతీర్థం శ్రీరాముని విగ్రహం ధ్వంసం ఘటనపై ఆందోళనలు కొనసాగుతుండగానే మరోపక్క విజయవాడలో సీత విగ్రహాన్ని కొందరు గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. విజయవాడలో బస్టాండ్ సమీపంలోని పురాతన సీతారామ ఆలయంలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.

ఈ ఘటనను గమనించిన ఆర్టీసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విగ్రహాలను పరిశీలించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ జరపాలని టీడీపీ నేత పట్టాభిరాం డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.